HYDRA: హైదరాబాద్‌లో రూ.1,650 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
హైదరాబాద్ నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో రూ.1,650 కోట్ల విలువైన 11 ఎకరాల భూమిని హైడ్రా కాపాడింది. ఇందులో 2 ఎకరాలు పార్కు కోసం, 5 ఎకరాలు శ్మశాన వాటిక కోసం, 4 ఎకరాల డంప్ యార్దుకు చెందినదిగా ఉంది. రంగరెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ విలేజ్‌లోని సెంట్రల్ పార్కు కాలనీలో పార్కు కోసం 2 ఎకరాలు కేటాయించారు. సర్వే నంబరు 110/1 లో 148 ప్లాట్లతో 16 ఎకరాల మేర సెంట్రల్ పార్కు కాలనీ ఫేజ్-1 పేరుతో 1998లో లే ఔట్ వేశారు.
ఇందులో 2 ఎకరాలను పార్కు కోసం కేటాయించగా, మున్సిపల్ అధికారులు పార్కు స్థలంగా హద్దులు నిర్ధారించి ప్రహరీ కూడా నిర్మించారు. పార్కు కోసం కేటాయించిన భూమి తమదంటూ కొంతమంది ఆక్రమించే ప్రయత్నం చేశారు. హైడ్రా ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు మేరకు రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో కలసి హైడ్రా క్షేత్రస్థాయిలో పరిశీలించింది. 2 ఎకరాల పార్కు స్థలంగా నిర్ధారించింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం పార్కులో తాత్కలికంగా వేసిన షెడ్డులను తొలగించింది. 2 ఎకరాల పార్కు స్థలం చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. పార్కు స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది.
ప్రగతినగర్‌లో 9 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
ప్రగతినగర్‌లోని అంబీర్ చెరువుకు ఆనుకుని ఉన్న 5 ఎకరాల శ్మశానవాటిక, పక్కనే ఉన్న 4 ఎకరాల డంపింగ్ యార్డు ఆక్రమణలకు గురౌతున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. రెవెన్యూ, జీహెచ్ ఎంసీ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో విచారించింది. కూకట్‌పల్లి మండలంలోని బాగామేరి విలేజ్ సర్వే నంబరు 103లో ఉన్న ఈ భూమిని శ్మశానవాటికకు, చెత్త డంపింగ్ యార్డుకు కేటాయించిందిగా నిర్ధారించుకుంది.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు 9 ఎకరాల భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. 5 ఎకరాలలో శ్మశాన వాటిక స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. ఆ పక్కనే ఉన్న 4 ఎకరాల్లో ప్రభుత్వ స్థలంగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది.