Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌కు రష్యాలో చికిత్స... ఖండించిన ఇరాన్

Mojtaba Khamenei Treatment in Russia Denied by Iran
షార్ట్స్‌లో చూడండి
ఇజ్రాయెల్‌తో కలిసి జరిపిన దాడుల్లో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయతుల్లా మొజ్తబా ఖమేనీ గాయపడినట్లు అమెరికా చెబుతుండడం తెలిసిందే. ఈ క్రమంలో ఖమేనీకి చికిత్స అందించడం కోసం రష్యా రాజధాని మాస్కోకు తరలించినట్లు కథనాలు వెలువడ్డాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్... ఖమేనీని వ్యక్తిగతంగా ఆహ్వానించారని వార్తలు వచ్చాయి. అయితే ఈ కథనాలను ఇరాన్ కొట్టిపారేసింది. రష్యాలోని ఇరాన్ రాయబారి కాజెమ్ జలాలీ ఈ వార్తలను తోసిపుచ్చారని 'టాస్' న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

మొజ్తబా ఖమేనీని చికిత్స కోసం మాస్కోకు తరలించినట్లు కొన్ని కథనాలు వెలువడుతున్నాయని, ఇది కొత్త తరహా మానసిక యుద్ధమని కాజెమ్ జలాలీ పేర్కొన్నారు. ఇరాన్ నేతలకు పారిపోవాల్సిన అవసరం, దాక్కోవాల్సిన అవసరం లేదని తెలిపారు. వారు ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటారని అన్నారు. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ముందు కూడా సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ వెనెజువెలా, రష్యాకు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు అసత్య ప్రచారం చేశారని అన్నారు. ఇప్పుడు మొజ్తబా చికిత్స కోసం రష్యా వెళ్ళినట్లు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంపై స్పందించేందుకు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెష్కోవ్ నిరాకరించారు. ఇజ్రాయెల్, అమెరికా దాడిలో మోజ్తబా తీవ్రంగా గాయపడ్డారని, ఆయన గుర్తుపట్టలేని విధంగా మారిపోయారని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ ఇటీవల తెలిపారు. మొజ్తబా బతికి ఉన్నారా లేదా అనే విషయం తనకు తెలియదని ట్రంప్ వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Mojtaba Khamenei
Iran
Russia
Israel
Ayatollah Khamenei
Moscow
চিকিৎসা treatment
Putin

More Telugu News