వాళ్ల భాషలోనే జవాబిస్తాం.. పాక్ దాడిపై ఆఫ్ఘన్ తాలిబాన్ల రియాక్షన్
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని ఒక డ్రగ్ రిహాబిలిటేషన్ (మత్తుపదార్థాల విముక్తి కేంద్రం) ఆసుపత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడులు అత్యంత బీభత్సాన్ని సృష్టించాయి. తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షాహీన్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, ఈ దాడిలో సుమారు 400 మంది మరణించారని, మరో 250 మంది తీవ్రంగా గాయపడ్డారని ధ్రువీకరించారు. మృతుల్లో ఎక్కువ మంది రోగులేనని తెలిపారు. నిస్సహాయ స్థితిలో ఉన్న రోగులు ఉండే ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకోవడాన్ని తాలిబన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనిని కేవలం యుద్ధ చర్యగా కాకుండా ‘మానవత్వానికి వ్యతిరేకమైన నేరం’ అని సుహైల్ షాహీన్ అభివర్ణించారు. అంతర్జాతీయ నియమాలకు విరుద్ధంగా పౌర సౌకర్యాలపై దాడులు చేయడం పాకిస్థాన్ క్రూరత్వానికి నిదర్శనమని ఆయన విమర్శించారు.
తాలిబన్ల ప్రతిస్పందన
ఈ అమానుష ఘటనపై తాలిబన్లు తీవ్రంగా స్పందించారు. ‘‘పాకిస్థాన్‌కు వారి భాషలోనే (దెబ్బకు దెబ్బ) సమాధానం చెబుతాం’’ అని షాహీన్ హెచ్చరించారు. ఈ దాడులు ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలను యుద్ధ వాతావరణానికి దారితీశాయని, తమ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి వెనకాడబోమని ఆయన స్పష్టం చేశారు. పాకిస్థాన్ దాడితో పాక్- ఆఫ్ఘన్ సరిహద్దుల వద్ద అత్యంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, ఈ దాడిపై ఆఫ్ఘన్ క్రికెటర్ రషీద్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఆసుపత్రులు, విద్యాసంస్థల వంటి చోట్ల దాడులు చేయడం ఆమోదయోగ్యం కాదని, అమాయక ప్రజల ప్రాణాలు తీయడం ఆపాలని కోరారు.