ఎప్ స్టీన్ ఫైల్స్‌తో లింక్.. రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేసిన కేంద్రమంత్రి కూతురు
- ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఢిల్లీ హైకోర్టులో దావా
- ఎప్ స్టీన్ ఫైల్స్‌తో సంబంధం ఉందని ప్రచారం చేస్తున్నారని ఆవేదన
- సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం విధించాలని కోర్టుకు విజ్ఞప్తి
గత నెల 22వ తేదీ నుంచి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తనను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
తనపై అసత్య ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఆయా సోషల్ మీడియా ఖాతాలపై శాశ్వత నిషేధం విధించాలని ఆమె కోరారు. తనపై నిరాధార ఆరోపణలతో ఉన్న కంటెంట్‌ను తొలగించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కాగా, పరువు నష్టం దావా కేసు రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.