వృద్ధురాలిని భయపెట్టిన రోబో అరెస్ట్.. వీడియో ఇదిగో!
సాధారణంగా మనుషులు ఎవరినైనా భయపెట్టినా లేక దాడి చేసినా పోలీసులు అరెస్ట్ చేయడం మనం చూస్తుంటాం. కానీ, చైనాలోని మకావులో ఒక రోబోను పోలీసులు అదుపులోకి తీసుకున్న వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక రోబో తనను వెంబడిస్తూ భయపెట్టిందంటూ ఒక వృద్ధురాలు గగ్గోలు పెట్టడంతో పోలీసులు రంగప్రవేశం చేసి రోబోను స్టేషన్‌కు తరలించాల్సి వచ్చింది.
అసలేం జరిగిందంటే..
గత వారం మకావులోని ఓ వీధిలో 70 ఏళ్ల వృద్ధురాలు మొబైల్ ఫోన్ చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో సుమారు 4 అడుగుల 4 అంగుళాల ఎత్తు ఉన్న ఒక చిన్న హ్యూమనాయిడ్ రోబో తనను అనుసరిస్తున్నట్లు ఆమె గమనించింది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసిన ఆమె, ఆ రోబో రూపాన్ని చూసి తీవ్ర భయాందోళనలకు గురైంది. ‘‘నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు.. నీకు పిచ్చెక్కిందా?’’ అంటూ ఆమె రోబోపై కేకలు వేసింది. ఆమె భయం ఎంతలా ఉందంటే, చివరకు ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించాల్సి వచ్చింది.
పోలీసుల ఎంట్రీ..
స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. రోబోను తమ కస్టడీలోకి తీసుకున్నారు. వైరల్ వీడియోలో ఇద్దరు పోలీసులు ఆ రోబోను పట్టుకుని తీసుకెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, ఆ రోబో వృద్ధురాలిని తాకలేదని, తన చేష్టలతో ఆమెను భయపెట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
రోబో యజమానికి పోలీసుల వార్నింగ్..
విచారణలో ఆ రోబో స్థానిక ఎడ్యుకేషన్ సెంటర్‌కు చెందినదని తేలింది. సంస్థ ప్రచారం కోసం 50 ఏళ్ల వ్యక్తి ఆ రోబోను రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేస్తూ టెస్టింగ్ చేస్తున్నాడు. అనుకోకుండా అది ఆ వృద్ధురాలి వెనుక వెళ్లడంతో ఈ గందరగోళం నెలకొంది. రోబో యజమానికి పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు పాదచారుల భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ, రోబోను విడిచిపెట్టారు.