రహస్యంగా పెళ్లి చేసుకున్న క్రికెటర్ యశ్ దయాళ్... వధువు ఎవరంటే...!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పేస్ బౌలర్ యశ్ దయాళ్ ఓ ఇంటివాడయ్యాడు. సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ శ్వేత పుండిర్‌ను వివాహం చేసుకున్నాడు. గత నెలలోనే వీరి పెళ్లి జరిగినప్పటికీ, ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
మీడియా కథనాల ప్రకారం, వీరి వివాహం ఫిబ్రవరి 4న ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జరిగింది. ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ జంట తమ పెళ్లి విషయాన్ని సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించలేదు. అయితే, దయాళ్ తో ఉన్న కొన్ని క్షణాలను శ్వేత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో రూపంలో పంచుకున్నారు. ఢిల్లీకి చెందిన శ్వేత పుండిర్ ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, వ్లాగర్‌గా గుర్తింపు పొందారు. ఆమెకు ఇన్‌స్టాలో 5.87 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.
లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌గా యశ్ దయాళ్ ఐపీఎల్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు. 2022లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడి, ఆ జట్టు టైటిల్ గెలవడంలో భాగమయ్యాడు. ఆ తర్వాత 2024 సీజన్‌లో ఆర్సీబీకి మారాడు. గత ఏడాది ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకోవడంలోనూ దయాళ్ కీలక పాత్ర పోషించాడు.
మార్చి 28న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఆర్సీబీ యాజమాన్యం అతడిని అట్టిపెట్టుకుంది. ఈ సీజన్‌లో టైటిల్ డిఫెండింగ్ లక్ష్యంతో బరిలోకి దిగుతున్న ఆర్సీబీకి దయాళ్ సేవలు కీలకం కానున్నాయి. మార్చి 28న చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆర్సీబీ తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
కాగా, యశ్ దయాళ్ పై జైపూర్ లో లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం గతంలో సంచలనం సృష్టించింది. యశ్ దయాళ్ తనను హోటల్ కు పిలిచి లైంగిక దాడి చేశాడని 17 ఏళ్ల అమ్మాయి తీవ్ర ఆరోపణలు చేసింది. క్రికెట్ లో మంచి కెరీర్ అందిస్తానని హామీ ఇచ్చి, రెండేళ్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె వెల్లడించింది. దాంతో అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.