తమిళనాడులో ప్రైవేటు కాలేజీ బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు

Tamil Nadu Train Accident 23 Students Injured
  • కుళత్తూరులోని మానవరహిత లెవల్ క్రాసింగ్ వద్ద ప్రమాదం
  • పట్టాలు దాటే సమయంలో వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు
  • 23 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు
తమిళనాడులోని కరూర్‌లో ఒక గూడ్స్ రైలు ప్రైవేటు కాలేజీ బస్సును ఢీకొట్టిన ఘటనలో 23 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడగా, అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రైల్వే లెవల్ క్రాసింగ్ దాటేందుకు ప్రయత్నించిన కాలేజీ బస్సును గూడ్స్ రైలు ఢీకొట్టింది. తాంతోణి సమీపంలోని ఒక ప్రైవేటు కళాశాలకు చెందిన బస్సు విద్యార్థులతో బయలుదేరింది.

సాయంత్రం వెళ్లియణై వద్ద కుళత్తూరులోని మానవరహిత రైల్వే లెవల్ క్రాసింగ్‌ను దాటేందుకు బస్సు డ్రైవర్ ప్రయత్నించాడు. ఆ సమయంలో వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టడంతో బస్సు వెనుక భాగం పూర్తిగా ధ్వంసమైంది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. 21 మందిని కరూర్ ప్రభుత్వ ఆసుపత్రి, ఇద్దరిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Tamil Nadu Train Accident
Karur
College Bus Accident
Train Collision
Railway Crossing Accident

More Telugu News