సింగపూర్ నుంచి డ్రోన్ల అక్రమ రవాణా.. శంషాబాద్ లో 70 డ్రోన్లు పట్టివేత
- డ్రోన్లు సీజ్ చేసి దర్యాప్తు చేపట్టిన కస్టమ్స్ అధికారులు
- పెద్ద సంఖ్యలో డ్రోన్లను తీసుకురావడం వెనకున్న కారణంపై ఆరా
- ప్రయాణికులను అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు వెల్లడి
మరోవైపు, పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం ముదురుతుండటం వల్ల అక్కడి గగనతలాన్ని మూసివేయడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టుపై తీవ్ర ప్రభావం పడింది. భద్రతా కారణాల దృష్ట్యా హైదరాబాద్ నుంచి వివిధ అంతర్జాతీయ దేశాలకు వెళ్లాల్సిన విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. శనివారం ఒక్కరోజే మొత్తం 13 అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీనితో విదేశాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఎయిర్ పోర్టులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యుద్ధం కారణంగా అంతర్జాతీయ విమాన రాకపోకలు అస్తవ్యస్తంగా మారడంతో ఎయిర్ పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు.