సమ్మె నోటీసు ఇచ్చిన తెలంగాణ ఆర్టీసీ జేఏసీ

Telangana RTC JAC Issues Strike Notice to Management
  • ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంతో పాటు వివిధ డిమాండ్లపై నోటీసు
  • సమ్మె తేదీపై 14 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
  • ఆర్టీసీ ఎండీ అందుబాటులో లేకపోవడంతో పేషీలో నోటీసులు
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంలో చేయడంతో పాటు వివిధ డిమాండ్లపై కార్మికులు ఈ నోటీసు ఇచ్చారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెకు వెళతామని హెచ్చరించారు. సమ్మె తేదీపై 14 రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ జేఏసీ తెలిపింది. ఆర్టీసీ ఎండీ అందుబాటులో లేకపోవడంతో పేషీలో నోటీసులు ఇచ్చింది. లేబర్ కమిషనర్ కార్యాలయంలోనూ నోటీసులు ఇచ్చింది.

2021 వేతన సవరణ 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ కోరింది. మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల రూ.350 కోట్లు కోత లేకుండా ఇవ్వాలని, పాత బకాయిలు రూ.2,500 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, ఉద్యోగులపై అధిక పనిభారం తగ్గించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Telangana RTC JAC
TSRTC strike
RTC employees strike notice
Telangana RTC merger
RTC wage revision

More Telugu News