అసోం నుంచి తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే అమృత్ భారత్ రైలు ప్రారంభం

  • అసోంలోని కామాఖ్య పుణ్యక్షేత్రం-చర్లపల్లి మధ్య రైలు సేవలు
  • ఈశాన్య ప్రాంతాల వైపు వెళ్లే ప్రయాణికులకు తక్కువ ఛార్జీతో ప్రయాణం
  • ఏపీ, తెలంగాణలలోని పలు స్టేషన్‌లలో ఆగనున్న అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
అసోం, రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ రైలును ప్రధాని అసోంలో ప్రారంభించారు. అసోంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కామాఖ్య, చర్లపల్లి మధ్య స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో ఈ రైలు సేవలు అందించనుంది. దీనితో ఈశాన్య ప్రాంతాల వైపు వెళ్లే ప్రయాణికులకు తక్కువ ఛార్జీలతో సౌకర్యవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది.

ఈ రైలు మార్గమధ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని శ్రీకాకుళం రోడ్డు, విజయనగరం జంక్షన్, పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట జంక్షన్, రాజమహేంద్రవరం, తణుకు, భీమవరం పట్టణం, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నల్గొండ స్టేషన్లలో ఆగుతూ, అక్కడి నుంచి చర్లపల్లికి చేరుకుంటుంది.

Narendra Modi
Amrit Bharat Express
Assam
Telugu States
Train Service
Kamakhya
Charlapalli

More Telugu News