Allu Arjun: ఘనంగా ప్రారంభమైన అల్లు సినిమాస్... వివాదంలో 'వాల్ ఆఫ్ గ్రేట్స్'
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏషియన్ సినిమాస్‌తో కలిసి నిర్మించిన 'అల్లు సినిమాస్' మల్టీప్లెక్స్ నిన్న హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై థియేటర్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లో తొలి, దేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందుతున్న ఈ థియేటర్ ప్రారంభోత్సవం ఒకవైపు అభినందనలు అందుకుంటుండగా, మరోవైపు ఒక కొత్త వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.
థియేటర్ లోపల భారతీయ సినిమాకు చెందిన గొప్ప దర్శకులకు నివాళిగా 'వాల్ ఆఫ్ గ్రేట్స్' పేరుతో ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ గోడపై ఎస్.ఎస్. రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్, మణిరత్నం, వెట్రిమారన్, ప్రశాంత్ నీల్, రాజ్‌కుమార్ హిరానీ, సంజయ్ లీలా భన్సాలీ, సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకుల చిత్రాలను ప్రదర్శించారు. అయితే, ఈ జాబితాలో కొందరు దిగ్గజ దర్శకుల ఫొటోలు లేకపోవడం తీవ్ర విమర్శలకు కారణమైంది.
భారతీయ కమర్షియల్ సినిమా రూపురేఖలు మార్చిన శంకర్, రామ్ గోపాల్ వర్మ వంటి దర్శకులను విస్మరించడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, తెలుగు సినిమా గతిని మార్చిన లెజెండరీ దర్శకులైన కె.వి. రెడ్డి, కళాతపస్వి కె. విశ్వనాథ్, దర్శకరత్న దాసరి నారాయణరావు, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, జంధ్యాల, సింగీతం శ్రీనివాసరావు, కోదండరామిరెడ్డి వంటి వారిని ఈ గౌరవానికి ఎంపిక చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అలాగే, పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల వంటి ఆధునిక కమర్షియల్ దర్శకులను కూడా పరిగణనలోకి తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం అల్లు అర్జున్‌తో సినిమా చేస్తున్న దర్శకుడు అట్లీ ఫొటో ఈ జాబితాలో ఉండటంతో ఈ వివాదం మరింత ముదిరింది. అల్లు అర్జున్ కేవలం తనకు నచ్చిన, తనతో పనిచేసిన దర్శకులకే ప్రాధాన్యత ఇచ్చారని, ఇది పక్షపాతంతో కూడిన ఎంపిక అని పలువురు సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు. "ఆర్జీవీ లేకుండా భారతీయ సినిమా చరిత్ర ఎలా పూర్తవుతుంది?", "విశ్వనాథ్, దాసరి, రాఘవేంద్రరావుల వంటి మహామహుల సంగతేంటి?" అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు.