YS Jagan: నేడు వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం.. జగన్ భావోద్వేగం!

YS Jagan Emotional Speech at YSRCP 16th Anniversary
  • 2021 మార్చి 12న ఆవిర్భవించిన వైసీపీ
  • తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మిన్నంటిన వేడుకలు
  • నల్లకాల్వలో ఇచ్చిన మాట కోసమే పార్టీ పుట్టిందన్న జగన్
  • వైసీపీ అనేది కోట్లాది మంది ప్రజలు సొత్తు అని వ్యాఖ్య
  • వైసీపీ అభిమాని కాలర్ ఎగిరేసేలా పార్టీ భవిష్యత్తు ఉంటుందన్న జగన్
  • విలువలు, విశ్వసనీయతకు పార్టీ కట్టుబడి ఉంటుందన్న వైసీపీ అధినేత

2021 మార్చి 12న ఆవిర్భవించిన వైసీపీ... 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు మిన్నంటాయి. ఈరోజు జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కార్యక్రమంలో పార్టీ అధినేత జగన్ వైసీపీ జెండాను ఆవిష్కరించి, కార్యకర్తలను ఉద్దేశించి ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. పార్టీ భవిష్యత్తుపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తపరిచారు.


నల్లకాల్వలో ఇచ్చిన మాట కోసమే ఈ పార్టీ పుట్టిందని జగన్ గుర్తుచేశారు. తాను ఇచ్చిన ఆ ఒక్క మాట రాష్ట్ర రాజకీయాల దశను, దిశను మార్చివేసిందని ఆయన అన్నారు. 2011 మార్చి 12న పార్టీ ఆవిర్భవించిందని... వైసీపీ అనేది కోట్లాది మంది ప్రజల సొత్తు అని, మొదటి నుంచి తాను కేవలం ప్రజలను, దేవుడిని మాత్రమే నమ్ముకున్నానని స్పష్టం చేశారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు వైసీపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పారు.


వై‌సీపీ అభిమాని కాలర్ ఎగరేసేలా పార్టీ భవిష్యత్తు ఉంటుందని ఆయన కార్యకర్తల్లో ధైర్యం నింపారు. తనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న ప్రతి గుండెకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందజేశారు. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వైఎసీపీ శ్రేణులు ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాయి. 2011లో స్థాపించబడిన ఈ పార్టీ, 2019లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చి ఐదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.


మరోవైపు, ఎక్స్ వేదికగా కూడా ఆయన భావోద్వేగపూరితమైన పోస్ట్ పెట్టారు. "నా ధైర్యం మీరే.. నా బలం మీరే. నాన్న గారి ఆశయ సాధన కోసం స్థాపించిన మ‌న పార్టీని, న‌న్ను మీరు గుండెల్లో పెట్టుకున్నారు, భుజాలపై మోస్తున్నారు. కష్టకాలంలో వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం నిల‌బ‌డుతున్నారు. పార్టీపై నమ్మకం పెట్టుకుని, నాపై న‌మ్మకం ఉంచి పార్టీ కోసం నిలిచిన మీరే మ‌న‌ పార్టీకి అసలైన బలం.. నా బ‌లం. 

మన పార్టీ ప్రస్థానం కేవలం ఒక రాజకీయ ప్రయాణం మాత్రమే కాదు. ఒక ల‌క్ష్యంతో లక్షలాది మంది కార్యకర్తల క‌ష్టం, నమ్మకం, త్యాగాలకు నిలువెత్తు సాక్ష్యం. వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులకు పేరు పేరునా శుభాకాంక్షలు" అని ట్వీట్ చేశారు.
YS Jagan
YSRCP
YSR Congress Party
YSR
Jagan Mohan Reddy
Andhra Pradesh Politics
YSRCP Formation Day
Tadepalli
AP Politics
2019 Elections

More Telugu News