Nara Lokesh: ఢిల్లీ చేరుకున్న మంత్రి నారా లోకేశ్.. రేపు వాట్సాప్ ఫోరమ్ సమావేశానికి హాజరు

Nara Lokesh Reaches Delhi to Attend WhatsApp Forum Meeting
  • మెటా సదస్సు కోసం ఢిల్లీకి లోకేశ్.
  • ఘన స్వాగతం పలికిన ఎంపీలు
  • డిజిటల్ గవర్నెన్స్‌, పౌర సేవలపై ప్రసంగించనున్న లోకేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ చేరుకున్నారు. రాజధానికి విచ్చేసిన ఆయనకు టీడీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన పార్టీ ఎంపీలతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. బుధవారం జరగనున్న కీలక కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి లోకేశ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు.

ప్రముఖ సోషల్ మీడియా సంస్థ 'మెటా' ఆధ్వర్యంలో రేపు (మార్చి 11న) జరగనున్న 'వాట్సాప్ సిటిజన్ ఎంగేజ్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫోరమ్' సమావేశంలో మంత్రి లోకేశ్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సదస్సులో డిజిటల్ గవర్నెన్స్, పౌర సేవల్లో టెక్నాలజీ వినియోగం, ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడం వంటి అంశాలపై ఆయన మాట్లాడనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా సాంకేతికతను ప్రభుత్వ సేవలకు అనుసంధానించడంలో ఆయన తన అనుభవాలను, భవిష్యత్ ప్రణాళికలను ఈ వేదికగా పంచుకోనున్నారు. 
Nara Lokesh
Andhra Pradesh
IT Minister
WhatsApp Forum
Meta
Digital Governance
Citizen Engagement
Technology
Government Services
TDP

More Telugu News