విజయ్, త్రిష వ్యవహారంపై స్పందించిన బీజేపీ నాయకురాలు ఖుష్బూ

  • వీరి విషయంలో ప్రజలకు ఏం ఆసక్తి అనేది అర్థం కావడం లేదన్న ఖుష్బూ
  • అది వారి వ్యక్తిగత విషయమన్న ఖుష్బూ
  • దీనిని ఎందుకు పెద్ద విషయంగా చూస్తున్నారని ప్రశ్న
ప్రముఖ తమిళ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, నటి త్రిష వ్యవహారంపై తమిళనాడు బీజేపీ నాయకురాలు ఖుష్బూ స్పందించారు. వీరి విషయంలో ప్రజలకు ఏం ఆసక్తి అనేది తనకు అర్థం కావడం లేదని అన్నారు. ఈ వ్యవహారంతో ప్రజలకు ఎలాంటి సంబంధం లేదని అభిప్రాయపడ్డారు. అది వారి వ్యక్తిగత విషయమని వెల్లడించారు. దీనిని ఎందుకు పెద్ద విషయంగా చూస్తున్నారని వ్యాఖ్యానించారు.

ముంబైలో జరిగిన ఒక కార్యక్రమానికి ఖుష్బూ హాజరయ్యారు. ఈ క్రమంలో విజయ్, త్రిష అంశం తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీపై ప్రభావం చూపుతుందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఖుష్బూ స్పందిస్తూ, ఎవరికి, ఎందుకు ఓటు వేయాలో ప్రజలకు బాగా తెలుసని అన్నారు. వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని అన్నారు.


More Telugu News