భార్యను గౌరవించని వ్యక్తి.. మహిళలను గౌరవిస్తాడా?: విజయ్‌పై సొంత పార్టీ నేత ప్రశ్న
- నటుడు విజయ్‌కు సొంత పార్టీ నుంచే ఎదురుదెబ్బ
- విడాకులపై చేసిన వ్యాఖ్యలపై మహిళా నేత రంజన ఆగ్రహం
- భార్యకే గౌరవం ఇవ్వని వ్యక్తి ఇతరులను ఎలా గౌరవిస్తారని ప్రశ్న
- నటి త్రిషతో కలిసి వేడుకకు వెళ్లడంపైనా విమర్శలు
రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్‌కు సొంత పార్టీ నుంచే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల మహిళా దినోత్సవం నాడు తన వ్యక్తిగత జీవితం, విడాకుల వ్యవహారంపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. విజయ్ వైఖరిని ఆయన పార్టీ మహిళా విభాగం నేత రంజన నాచియార్ తీవ్రంగా తప్పుబట్టారు.
ఏఎన్ఐ వార్తా సంస్థతో రంజన మాట్లాడుతూ విజయ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. "సొంత భార్యకు గౌరవం ఇవ్వని వ్యక్తి, ఇతర మహిళలను గౌరవిస్తారని ఎలా నమ్మాలి?" అని ఆమె సూటిగా ప్రశ్నించారు. 20 ఏళ్లుగా కాపురం చేసి, ఇద్దరు పిల్లలకు తల్లయిన భార్య గురించి 'అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేని విషయం' అన్నట్లుగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ముఖ్యమంత్రి కావాలని ఆశించే వ్యక్తి సమాజానికి ఆదర్శంగా నిలవాలని, ఇలాంటి వ్యాఖ్యలు యువతకు తప్పుడు సంకేతాలు పంపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, విడాకుల కేసు నడుస్తున్న సమయంలో నటి త్రిషతో కలిసి విజయ్ ఒక వివాహ వేడుకకు హాజరుకావడాన్ని కూడా ఆమె విమర్శించారు. రాజకీయాల కంటే కుటుంబానికి ఇచ్చే గౌరవమే ముఖ్యమని, ఆయన చర్యలు యువతకు తప్పుడు సంకేతాలు ఇస్తాయని పేర్కొన్నారు.