యుద్ధం ఎఫెక్ట్.. గ్యాస్ సిలిండర్ బుకింగ్ వ్యవధిపై కేంద్రం కీలక నిర్ణయం

  • సిలిండర్ల కొరత భయంతో ముందస్తుగా బుక్ చేసుకుంటున్న వినియోగదారులు
  • సగటున 55 రోజులకు బుక్ చేసుకునే వాళ్లు ప్రస్తుతం 15 రోజులకే బుకింగ్
  • ఇటీవల బుకింగ్‌కు 21 రోజుల వ్యవధిని తీసుకువచ్చిన కేంద్రం
  • సిలిండర్ బుకింగ్ గడువును తాజాగా 25 రోజులకు పెంచిన కేంద్రం
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో చమురు, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ ను నివారించడానికి, సిలిండర్లను న్యాయబద్ధంగా అందించడానికి భారత ప్రభుత్వం ఎల్పీజీ బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుండి 25 రోజులకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నది. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో సిలిండర్ల కొరత ఏర్పడుతుందనే భయంతో చాలామంది ముందస్తుగా బుకింగ్ చేసుకుంటున్నారు.

గతంలో సగటున 55 రోజులకు ఒకసారి సిలిండర్ బుక్ చేసుకునే వాళ్లు ప్రస్తుతం 15 రోజులకే బుక్ చేస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో ప్రభుత్వం బుకింగ్‌కు 21 రోజుల వ్యవధిని తీసుకువచ్చారు. తాజాగా దీనిని 25 రోజులకు పెంచారు. కమర్షియల్ వినియోగదారుల కంటే గృహ వినియోగదారులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని గ్యాస్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.

వంట గ్యాస్ సిలిండర్‌పై కేంద్రం రూ.60 పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకున్నది. వాణిజ్య సిలిండర్‌పై రూ.114.5 పెంచింది. కాగా, ఎల్పీజీ విక్రయానికి అల్జీరియా, ఆస్ట్రేలియా, కెనడా, నార్వే వంటి దేశాలు ముందుకు వచ్చినట్లు కేంద్రం తెలిపింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పటికీ ఇప్పటికిప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదని, దేశంలో ప్రస్తుతం సరిపడా ఇంధనం నిల్వలు ఉన్నాయని తెలిపింది.

LPG Cylinder
Gas Cylinder Booking
India Gas Crisis
Oil Prices
Iran Israel War
Gas Cylinder Price Hike

More Telugu News