ముంబైలో 2BHKకు లక్ష అద్దె.. టెక్కీల ఫ్లాట్ వీడియోపై నెట్టింట రచ్చ!
- వైరల్ అవుతున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల వీడియో
- అద్దెలపై సోషల్ మీడియాలో నెటిజన్ల విస్మయం
- సౌత్ ముంబైలో ఉండటానికే ఇంత ఖర్చు అని యువతుల వెల్లడి
కలల నగరం ముంబైలో నివసించడం ఎంత ఖరీదో చెప్పేందుకు మరో ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. పరేల్ ప్రాంతంలో ఓ 2BHK ఫ్లాట్‌లో నివసిస్తున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, నెలకు ఏకంగా లక్ష రూపాయలు అద్దె చెల్లిస్తున్నట్లు చెప్పిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ముంబైలో అద్దెల మోతపై నెటిజన్ల మధ్య తీవ్రమైన చర్చ జరుగుతోంది.
ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన అపార్ట్‌మెంట్ టూర్ వీడియోలో ఈ వివరాలు బయటపడ్డాయి. సుమారు 700 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ ఫ్లాట్‌కు మెయింటెనెన్స్‌తో కలిపి లక్ష రూపాయలు చెల్లిస్తున్నట్లు అందులో నివసిస్తున్న యువతులు తెలిపారు. కిటికీలోంచి విమానాలు ల్యాండ్ అవ్వడం, టేకాఫ్ అవ్వడం చూడొచ్చని, అదే తనకు ఇష్టమైన విషయమని ఓ యువతి పేర్కొంది. "23 ఏళ్ల వయసులో సౌత్ బొంబాయిలో (సోబో) ఉండటానికి ఇది సరైన ప్రదేశం" అని ఆమె తన నిర్ణయాన్ని సమర్థించుకుంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు అద్దె మొత్తం విని షాక్ అవుతున్నారు. ‘ఇదో పెద్ద స్కామ్’ అని కొందరు కామెంట్ చేయగా, "నా జీతం కంటే ఈ ఫ్లాట్ అద్దెనే ఎక్కువ" అని మరికొందరు వాపోతున్నారు. ఇంత డబ్బుతో వేరే నగరాల్లో సులభంగా ఇల్లు కొనుక్కోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా, ముంబైలో మంచి లొకేషన్, వ్యూ కోసం యువత లక్షల్లో అద్దెలు చెల్లించే ట్రెండ్ కొనసాగుతోందని ఈ సంఘటన మరోసారి స్పష్టం చేసింది.