Gaddam Prasad Kumar: ముగిసిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ.. కడియం, దానంల కేసుల్లో తీర్పు రిజర్వ్
- సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ ముగించిన స్పీకర్
- 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్
- కడియం, దానంల భవితవ్యంపై ఉత్కంఠ
తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం క్లైమాక్స్ కు చేరుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పక్షాన చేరిన పది మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈరోజు తుది విచారణ ముగించారు. సుప్రీంకోర్టు విధించిన గడువు ముగుస్తుండటంతో స్పీకర్ తీసుకున్న నిర్ణయం కీలకంగా మారింది. ఇందులో ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చీట్ ఇచ్చిన స్పీకర్, వారిపై ఉన్న పిటిషన్లను కొట్టివేశారు. అయితే, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కేసుల్లో మాత్రం తీర్పును రిజర్వ్ చేశారు. వీరిద్దరి భవితవ్యంపై స్పీకర్ ఏ క్షణమైనా తుది తీర్పు వెలువరించే అవకాశం ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.