Avika Gor: ఈవెంట్‌లో అస్వస్థతకు గురైన అవికా గోర్.. ప్రెగ్నెన్సీపై సోషల్ మీడియాలో ఊహాగానాలు!

Avika Gor Sparks Pregnancy Rumors After Event Incident
  • భర్తతో కలిసి ఈవెంట్‌కు హాజరైన నటి అవికా గోర్
  • ఫొటోలు దిగుతుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన నటి
  • అవికా గర్భవతి అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం
  • ఆమె ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న అభిమానులు
  • ఈ వార్తలపై ఇప్పటివరకు స్పందించని అవికా, మిలింద్ దంపతులు
‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకుల ఇళ్లలో సభ్యురాలిగా మారిపోయిన నటి అవికా గోర్, ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచారు. ఇటీవల ఆమె తన భర్త మిలింద్ చంద్వానీతో కలిసి ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు. అక్కడ జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆమె గర్భవతి అయి ఉండవచ్చంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ పరిణామం ఆమె అభిమానుల్లో ఆందోళనతో పాటు ఆసక్తిని కూడా రేకెత్తిస్తోంది.

అస‌లేం జ‌రిగిందంటే..! 
అవికా గోర్ తన భర్త మిలింద్‌తో కలిసి ఓ కార్యక్రమానికి హాజరై, ఫోటోగ్రాఫర్లకు ఎంతో ఉత్సాహంగా పోజులిచ్చారు. అంతలోనే ఆమె అకస్మాత్తుగా అసౌకర్యానికి గురై, వాంతి చేసుకున్నట్టుగా కనిపించారు. వెంటనే అప్రమత్తమైన ఆమె భర్త మిలింద్, ఫొటోలు తీయవద్దని మీడియా ప్రతినిధులను సున్నితంగా వారించి, ఆమెను జాగ్రత్తగా అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్లారు. ఇదంతా వీడియోలో రికార్డ్ కావడంతో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. చాలామంది ఇది గర్భం దాల్చినప్పుడు కలిగే లక్షణమని, అవికా త్వరలోనే తల్లి కాబోతోందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు అభిమానులు మాత్రం ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ, అది సాధారణ అనారోగ్య సమస్య కూడా కావచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ ప్రచారంపై ఇప్పటివరకు అవికా గోర్ గానీ, ఆమె భర్త మిలింద్ చంద్వానీ గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఈ వార్తల్లో ఎంత నిజముందనే దానిపై స్పష్టత లేదు.

హిందీలో ‘బాలికా వధు’ సీరియల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అవికా, తెలుగులో ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోయిన్‌గా అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మామ’ వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. తన కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకునే అవికా, ఈ ప్రెగ్నెన్సీ వార్తలపై ఎప్పుడు స్పందిస్తారో వేచి చూడాలి.
Avika Gor
Avika Gor pregnancy
Milind Chandwani
Uyyala Jampala movie
Balika Vadhu serial
Telugu actress
pregnancy rumors
actress health
social media viral
Lakshmi Raave Maa Intiki

More Telugu News