లే ఆఫ్... 300 మంది ఉద్యోగులను సాగనంపుతున్న ఫ్లిప్ కార్ట్!
- ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో ఉద్యోగాల కోత
- సుమారు 250 నుంచి 300 మంది ఉద్యోగులను తొలగించిన యాజమాన్యం
- వార్షిక పనితీరు సమీక్షలో భాగంగానే ఈ చర్యలని వెల్లడి
- ఇది సాధారణ ప్రక్రియేనని ఫ్లిప్ కార్ట్ ప్రకటన
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ తన ఉద్యోగులకు షాకిచ్చింది. వార్షిక పనితీరు సమీక్ష పేరుతో సుమారు 250 నుంచి 300 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. వివిధ విభాగాలు, స్థాయిల్లో ఈ కోతలు ఉన్నట్లు తెలుస్తోంది. తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు సిద్ధమవుతున్న తరుణంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ తొలగింపులపై ఫ్లిప్ కార్ట్ యాజమాన్యం స్పందించింది. ఉద్యోగుల పనితీరును తాము క్రమం తప్పకుండా సమీక్షిస్తామని, నిర్దేశిత అంచనాలను అందుకోలేకపోయిన కొద్ది శాతం మంది ఉద్యోగులు సంస్థ నుంచి వైదొలగుతున్నారని ఒక ప్రకటనలో తెలిపింది. ఇది ఏటా జరిగే సాధారణ ప్రక్రియలో భాగమేనని పేర్కొంది. ఎంత మందిని తొలగించారన్న విషయాన్ని మాత్రం ఫ్లిప్ కార్డ్ వెల్లడించలేదు.
అయితే, ఓ వైపు ఐపీఓ కోసం సన్నాహాలు చేస్తూ, మరోవైపు సీనియర్ స్థాయి ఉద్యోగాల్లో నియామకాలు జరుపుతున్న ఫ్లిప్ కార్ట్.. అదే సమయంలో ఉద్యోగులను తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ఫ్లిప్ కార్ట్ 2024లో కూడా దాదాపు 1000 మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.
వాల్ మార్ట్ మద్దతు కల్గిన ఫ్లిప్ కార్ట్ త్వరలో ఐపీఓకు వచ్చేందుకు సన్నహాలు చేస్తోంది. ఇందులో భాగంగా సింగపూర్ లో ఉన్న తన ప్రధాన కార్యాలయాన్ని భారత్ కు తరలించింది. భారత నియంత్రణ సంస్థల అవసరాలకు అనుగుణంగా తన హోల్డింగ్ నిర్మాణంలో మార్పులు చేసింది.