Chandrababu Naidu: ప్రాజెక్టుల నాణ్యతలో రాజీ పడొద్దు: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Focuses on Quality of Irrigation Projects
  • పోలవరం, వెలిగొండ సహా పలు కీలక ప్రాజెక్టుల ప్రగతిపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
  • దెబ్బతిన్న పోలవరం డయాఫ్రం వాల్ స్థానంలో కొత్తది నిర్మించాలని నిర్ణయం
  • నిపుణుల నివేదికలు ఉన్నప్పటికీ.. ప్రజా భద్రతకే ప్రాధాన్యత అని వెల్లడి
ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీకి తావులేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పోలవరం, వెలిగొండ, హంద్రీ-నీవా, చింతలపూడి లిఫ్ట్ సహా పలు కీలక ప్రాజెక్టుల పురోగతిపై ఆయన అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

గత ప్రభుత్వ హయాంలో కీలకమైన పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ దెబ్బతిన్న విషయాన్ని ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. "దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు మరమ్మతులు చేస్తే సరిపోతుందని నిపుణులు నివేదికలు ఇచ్చినా, నాణ్యత, ప్రజా భద్రత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశ్యంతోనే కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించాం" అని చంద్రబాబు తేల్చి చెప్పారు.

ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఝంఝావతి రబ్బర్ డ్యాం కొట్టుకుపోయిన ఘటనను గుర్తు చేస్తూ, నిర్మాణాల్లో నాణ్యతా లోపాలను సహించేది లేదన్నారు. తమ ప్రభుత్వం ఇరిగేషన్ రంగానికి ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. పోలవరం-నల్లమల సాగర్ లింక్, వరికపూడిశెల లిఫ్ట్, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనులపైనా ఈ సమీక్షలో చర్చించారు.
Chandrababu Naidu
Polavaram Project
Irrigation Projects
Andhra Pradesh
Veligonda Project
Handri Neeva
Chintalapudi Lift Irrigation
YS Rajasekhara Reddy
Rubber Dam
Water Resources

More Telugu News