విధ్వంసం చేయకుండానే మూసీ సుందరీకరణ పనులు చేయవచ్చు: కేటీఆర్
- బీఆర్ఎస్ హయాంలో ఐదున్నర కిలోమీటర్ల పొడవున సుందరీకరణ పనులు చేశామన్న కేటీఆర్
- ప్రజల ఆస్తులకు నష్టం చేయకుండా అభివృద్ధి చేయవచ్చని నిరూపించామన్న కేటీఆర్
- సుందరీకరణ పనులు తమకు అప్పగిస్తే రూ.16 వేల కోట్లకే చేసి చూపిస్తామని సవాల్
హైదరాబాద్ నగరంలోని నాగోల్లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరంలో హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు. పేదల ఇళ్లు కూల్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.1.50 లక్షల కోట్లతో మూసీ సుందరీకరణ పనులు చేస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారని, కానీ రూ.16 వేల కోట్లతోనే ఆ పనులు చేయవచ్చని అన్నారు.
మూసీ సుందరీకరణ పనులను తమకు అప్పగిస్తే రూ.16 వేల కోట్లకే చేసి చూపిస్తామని అన్నారు. పైగా ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా అభివృద్ధి చేస్తామని అన్నారు. హామీల అమలు కోసమే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని అన్నారు. ఈ రెండున్నరేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఇంటిని నిర్మించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు.