మంచు మనోజ్ సినిమాలో మెరవనున్న రాశి ఖన్నా

Manchu Manoj and Raashi Khanna to share screen in David Reddy
  • పీరియాడిక్ విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న 'డేవిడ్ రెడ్డి'
  • బ్రిటీష్ కాలం నాటి కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం
  • ఐటెం సాంగ్ కోసం రాశి ఖన్నాను ఎంపిక చేసినట్టు టాక్

టాలీవుడ్ యాక్షన్ స్టార్ మంచు మనోజ్ తన తాజా చిత్రం ‘డేవిడ్ రెడ్డి’తో వెండితెరపై ఒక భారీ పీరియాడిక్ విజువల్ వండర్‌ను ఆవిష్కరించబోతున్నారు. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాలో మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించే ఒక స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేశారట. ఇందులో మనోజ్‌తో కలిసి స్టెప్పులు వేయడానికి గ్లామరస్ బ్యూటీ రాశి ఖన్నాను ఎంపిక చేసినట్లు సమాచారం. సీరియస్ కథాంశంతో సాగే ఈ సినిమాలో రాశి ఖన్నా చేసే ఈ ఐటెం సాంగ్ ఒక ఊపు ఊపుతుందని చిత్ర బృందం భావిస్తోంది.


ఇక ఈ సినిమా కథా నేపథ్యం విషయానికొస్తే.. స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ పాలకుల గుండెల్లో నిద్రపోయిన ‘డేవిడ్ రెడ్డి’ అనే వీర యోధుడి పోరాట గాథ ఇది. ఆ కాలం నాటి పరిస్థితులను కళ్లకు కట్టేలా చూపిస్తూనే, మనోజ్ పాత్రను అత్యంత శక్తిమంతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమాలో హీరో వాడే 700 కేజీల బరువున్న ‘వార్ డాగ్’ అనే స్పెషల్ బైక్ ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో మరియా రియాబోషప్క కథానాయికగా నటిస్తుండగా, ‘KGF’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం ఈ భారీ చిత్రానికి ప్రధాన బలంగా నిలవనుంది.

Go Back to Shorts
Manchu Manoj
David Reddy
Raashi Khanna
Hanuma Reddy Yekkanti
Tollywood
Telugu Movie
Item Song
Ravi Basrur
Maria Ryaboshapka
War Dog Bike

More Telugu News