ఇరాన్ ఇప్పుడు రెండు యుద్ధాలు ఎదుర్కొంటోంది: భారత్ లో ఇరాన్ ఎంబసీ ప్రతినిధి ఇలాహీ
- భారత్, చైనాలు గ్లోబల్ పవర్స్ కాకుండా అమెరికా కుట్ర చేస్తోందన్న ఇరాన్ ఎంబసీ ప్రతినిధి ఇలాహీ
- తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికే ప్రపంచ ఘర్షణలన్న ఆరోపణ
- అమెరికా ఆపితే తాము కూడా ఘర్షణను ఆపుతామని వెల్లడి
- సైనిక యుద్ధంతో పాటు ఫేక్ న్యూస్ యుద్ధాన్ని ఎదుర్కొంటున్నామని వ్యాఖ్య
ఇదే సందర్భంలో ఆయన సంచలన కామెంట్స్ చేశారు. భారత్‌తో పాటు చైనా అంతర్జాతీయంగా శక్తిమంతమైన దేశాలుగా ఎదగకుండా అడ్డుకోవడానికే అమెరికా తమ దేశంతో ఘర్షణ పడుతోందని ఆరోపించారు. భవిష్యత్తులో భారత్, చైనా, రష్యా, అమెరికా ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన దేశాలుగా ఉంటాయని అబ్దుల్ మజీద్ అన్నారు. అయితే, భారత్ లేదా చైనా తనతో సమానమైన శక్తులుగా మారడాన్ని అమెరికా సహించలేకపోతోందని, అందుకే యుద్ధాలను ప్రేరేపించి తన ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ఈ యుద్ధాన్ని ప్రారంభించింది అమెరికా, ఇజ్రాయెల్ అని, తాము కేవలం ఆత్మరక్షణకే పరిమితమయ్యామని అబ్దుల్ మజీద్ స్పష్టం చేశారు. ‘దాడిని ప్రారంభించింది అమెరికానే కాబట్టి, దాన్ని ముగించాల్సిన బాధ్యత కూడా ఆ దేశానిదే. వారు దాడులు ఆపితే, మేం కూడా ఆపుతాం’ అని ఆయన తెలిపారు.