గ్రాండ్‌గా విజయ్-రష్మిక రిసెప్షన్... హాజరైన సీఎం రేవంత్ రెడ్డి భార్య, చిరంజీవి, హరీశ్ రావు

Vijay Deverakonda Rashmika Reception Grand Celebration
  • హైదరాబాద్‌లోని హోటల్లో వేడుకగా రిసెప్షన్
  • హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి తదితరులు
  • సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన విజయ్, రష్మిక
ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ, రష్మిత రిసెప్షన్‌కు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. గత నెల 26న వివాహ బంధంతో వీరిద్దరు ఒక్కటయ్యారు. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో జరిగిన రిసెప్షన్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భార్య గీత, మాజీ మంత్రులు హరీశ్ రావు, మల్లారెడ్డి, జగదీశ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితర రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

సినిమా పరిశ్రమ నుంచి చిరంజీవి, వెంకటేశ్, అక్కినేని నాగార్జున దంపతులు, నాగచైతన్య, రామ్ చరణ్ దంపతులు, నాని కుటుంబం, నవీన్ పోలిశెట్టి, దర్శకుడు సుకుమార్ కుటుంబం, నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ, నమ్రతా శిరోద్కర్, రాధికా శరత్ కుమార్ దంపతులు, నటి కీర్తి శెట్టి, నటుడు రవితేజ తదితరులు హాజరయ్యారు.

రిసెప్షన్‌లో విజయ్, రష్మికలు సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. చేతిలో చెయ్యి వేసి ఈ జంట రిసెప్షన్ వేదిక మీదకు వచ్చింది. తొలుత అతిథులను పలకరించి, ఆ తర్వాత సెలబ్రేషన్స్‌లో పాల్గొంది.
Go Back to Shorts
Vijay Deverakonda
Rashmika Mandanna
Vijay Rashmika Reception
Chiranjeevi
Revanth Reddy

More Telugu News