Telangana Electricity: తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యధికం.. నేడు రికార్డుస్థాయిలో విద్యుత్ వినియోగం

Telangana Electricity Consumption Reaches Record High
  • ఈరోజు 18,139 మెగావాట్ల విద్యుత్ వినియోగించినట్లు విద్యుత్ శాఖ వెల్లడి
  • భవిష్యత్తు విద్యుత్ అవసరాలకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించిన భట్టివిక్రమార్క
  • డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు వెల్లడి
తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే మంగళవారం అత్యధిక విద్యుత్ వినియోగం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు 18,139 మెగావాట్ల విద్యుత్ వినియోగించినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. వేసవి కాలం సమీపించిన నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గరిష్ఠస్థాయికి చేరుకుంది.

విద్యుత్ అధికారులతో మల్లు భట్టివిక్రమార్క భేటీ అయ్యారు. సమర్థంగా విద్యుత్ పంపిణీ చేస్తున్న సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భవిష్యత్ విద్యుత్ అవసరాలకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.

కాగా వేసవికాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. దీంతో గృహ, కార్యాలయాల్లో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుంది. వ్యవసాయ రంగానికి కూడా విద్యుత్ వినియోగం పెరిగింది. దీనితో రాష్ట్రంలో రోజురోజుకు విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరగడం కూడా అధిక విద్యుత్ వినియోగానికి మరో కారణంగా చెప్పవచ్చు. రాష్ట్రంలో పరిశ్రమల అవసరాలకు కూడా విద్యుత్ వినియోగం అధికమవుతోంది.
Telangana Electricity
Telangana power consumption
Electricity demand
Bhatti Vikramarka
Telangana news

More Telugu News