రై రై రా రా.. రామ్ చరణ్ గ్రేస్, స్పీడ్ చూస్తుంటే గర్వంగా ఉంది: చిరంజీవి

  • పెద్ది సెకండ్ సింగిల్‌పై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు
  • స్క్రీన్‌పై రామ్ చరణ్ ఎనర్జీ, స్పీడ్ చూసి గర్వపడుతున్నానన్న చిరు
  • డైరెక్టర్ బుచ్చిబాబు పిక్చరైజేషన్, రెహమాన్ మ్యూజిక్‌పై ప్రశంసలు
  • జానీ మాస్టర్ కొరియోగ్రఫీ, అనంత శ్రీరామ్ సాహిత్యం అద్భుతమన్న మెగాస్టార్
  • నిర్మాత వెంకట సతీష్ కిలారుకు, చిత్రబృందానికి శుభాకాంక్షలు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'పెద్ది'. ఈ సినిమా నుంచి నిన్న విడుదలైన సెకండ్ సింగిల్ 'రై రై రా రా' యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. మాస్ బీట్‌తో సాగే ఈ పాటకు మెగా అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. తాజాగా ఈ పాటను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు.

ఈ పాటలో రామ్ చరణ్ డ్యాన్స్, ఎనర్జీ చూస్తుంటే తనకు ఎంతో గర్వంగా ఉందని చిరంజీవి పేర్కొన్నారు. "పెద్ది నుంచి వచ్చిన 'రై రై రా రా' పాట స్క్రీన్‌పై ఓ ఫైర్‌లా ఉంది. ఎనర్జీ, ఎమోషన్, సినిమాటిక్ బ్రిలియెన్స్ కలగలిపిన అద్భుతం ఇది. రామ్ చరణ్ తనదైన గ్రేస్, ఎలక్ట్రిఫయింగ్ స్పీడ్‌తో స్క్రీన్‌ను వెలిగించిన తీరు చూస్తుంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తోంది. చరణ్ డ్యాన్స్ మూమెంట్స్ చూడటం కనులవిందుగా ఉంది" అని చిరంజీవి తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

అలాగే చిత్రబృందం పనితీరును కూడా ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. పాటను అద్భుతంగా పిక్చరైజ్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు సానా, మ్యాజికల్ ట్యూన్, వోకల్స్ అందించిన ఏఆర్ రెహమాన్, పవర్ ప్యాక్డ్ కొరియోగ్రఫీ అందించిన జానీ మాస్టర్‌ను చిరంజీవి అభినందించారు. విజువల్స్ అందించిన సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, అర్థవంతమైన సాహిత్యం అందించిన అనంత శ్రీరామ్‌తో పాటు, ఈ భారీ విజన్‌ను సాకారం చేస్తున్న నిర్మాత వెంకట సతీష్ కిలారుకు అభినందనలు తెలిపారు. పెద్ది టీమ్ మరిన్ని మైలురాళ్లను అధిగమించాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం మెగాస్టార్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.


More Telugu News