50 లక్షలతో 120 కోట్లు తెచ్చిపెట్టిన సినిమా .. ఓటీటీలో!
- ఓటీటీలో 'లాలో : కృష్ణ సదా సహాయతే'
- గుజరాతీలో తొలి 100 కోట్ల సినిమా
- స్టార్స్ లేకుండా రికార్డు సృష్టించిన కంటెంట్
- 'సోనీలివ్' చేతికి స్ట్రీమింగ్ హక్కులు
- ఈ నెల 6 నుంచి మొదలు కానున్న స్ట్రీమింగ్
సాధారణంగా చాలా తక్కువ బడ్జెట్లో తెరకెక్కడం .. భారీవసూళ్లను రాబట్టడం మలయాళ ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో తమిళ .. కన్నడ సినిమాలు ఆ బాటలోనే ముందుకు వెళుతున్న తీరు కనిపిస్తుంది. రీసెంటుగా గుజరాతి సినిమా కూడా ఇలాంటి ఒక రికార్డును తొలిసారిగా తన ఖాతాలో వేసుకుంది. ఆ సినిమా పేరే 'లాలో: కృష్ణ సదా సహాయతే'. ఈ మధ్య కాలంలో చుట్టుపక్కల సినిమా ఇండస్ట్రీలన్నీ మాట్లాడుకునేలా చేసిన సినిమా ఇది.
గుజరాతీలో రూపొందిన ఈ సినిమా, క్రితం ఏడాది అక్టోబర్ 10వ తేదీన అక్కడ విడుదలైంది. రీవా రిచ్ .. శ్రుహాద్ గోస్వామి .. కరణ్ జోషీ .. తదితరులు ఈ సినిమాలో నటించారు. అంకిత్ సఖియా దర్శకత్వం వహించిన ఈ సినిమాకి స్మిత్ జె సంగీతాన్ని అందించాడు. గుజరాతీలో ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది. కేవలం 50 లక్షల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, 120 కోట్లను వసూలు చేయడం విశేషం. గుజరాతీ ఇండస్ట్రీలో తొలిసారిగా 100 కోట్లను రాబట్టిన సినిమా ఇది.
స్టార్ హీరోలు .. స్టార్ హీరోయిన్స్ లేని సినిమా. గ్రాఫిక్స్ గారడీలు కనిపించని సినిమా. అలాంటి ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని సాధించడం గురించి అంతా విశేషంగా చెప్పుకున్నారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడు ఓటీటీకి వస్తుందా అని చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా 'సోనీలివ్' ప్రకటించింది. ఒక సాధారణ ఆటో డ్రైవర్ జీవితం .. కృష్ణుడి అనుగ్రహం కారణంగా ఎలా ప్రభావితమైందనేది కథ. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఏ రేంజ్ లో కనెక్ట్ అవుతుందనేది చూడాలి.