గల్ఫ్ దేశాల్లో ఏయే దేశంలో ఎంతమంది భారతీయులు ఉన్నారంటే..!

Indian Population in Gulf Countries Details
  • అత్యధికంగా యూఏఈలో 43.26 లక్షల మంది
  • సౌదీ అరేబియాలో 27.47 లక్షల మంది భారతీయులు
  • సంక్షోభంతో అట్టుడుకుతున్న ఇరాన్ లో 10,765 మంది
పశ్చిమాసియాను యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ గల్ఫ్ దేశాల్లోని భారతీయుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాన్ ప్రతీకార దాడులతో గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లోని భారత రాయబార కేంద్రాలు అక్కడున్న భారతీయులను అప్రమత్తం చేస్తూ అడ్వైజరీ జారీ చేశాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఢిల్లీలో ఓ హెల్ప్ లైన్ కేంద్రాన్ని ప్రారంభించింది. వైమానికి దాడుల కారణంగా విమానాలు రద్దు కావడంతో గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన వారిని భారత్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో గల్ఫ్ దేశాల్లో భారతీయుల సంఖ్య ఎలా ఉందంటే.. 
 
  • యూఏఈ 43.26 లక్షలు
  • కువైట్ 10.36 లక్షలు
  • బహ్రెయిన్ 3.1 లక్షలు
  • సౌదీ అరేబియా 27.47
  • ఖతార్ 8.30
  • ఒమన్ 6.76 లక్షలు
  • ఇరాక్ 17,100
  • ఇరాన్ 10,765
  • లెబనాన్ 3,040
  • ఇజ్రాయెల్ 10,500
  • జోర్డాన్ 17,050
మొత్తంగా గల్ఫ్ దేశాల్లో దాదాపు 90 లక్షల నుంచి కోటి మంది వరకు భారతీయులు ఉన్నారని కేంద్ర విదేశాంగ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Go Back to Shorts
Indian Expats
Gulf Countries
Indian Diaspora
UAE
Kuwait
Saudi Arabia
Qatar
Oman
Expatriates in Gulf
India Foreign Affairs

More Telugu News