భారత్ విజయం తట్టుకోలేక లైవ్ షోలో టీవీ పగులగొట్టిన పాక్ యాంకర్.. వీడియో ఇదిగో!
- భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య సూపర్ 8 పోరు
- మ్యాచ్ జరుగుతుండగా చర్చ నిర్వహించిన పాక్ టీవీ ఛానల్
- టీమిండియా అద్భుత ప్రదర్శన తట్టుకోలేక యాంకర్ ఆవేశం
టీ20 వరల్డ్ కప్ సూపర్-8 పోరులో వెస్టిండీస్‌ను భారత్ చిత్తు చేసి సెమీఫైనల్ కు దూసుకెళ్లడాన్ని పాకిస్థానీ టీవీ యాంకర్ జీర్ణించుకోలేకపోయాడు. ఆవేశం పట్టలేక అప్పటి వరకూ మ్యాచ్ చూసిన టీవీని పగలగొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ‘ఘర్ కే కలేష్’ ఎక్స్ ఖాతాలో వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే..
వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించి సెమీస్ లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్ జరుగుతుండగా పాకిస్థాన్ కు చెందిన ఒక న్యూస్ ఛానల్ స్టూడియోలో చర్చ నిర్వహించింది. టీమ్ ఇండియా అద్భుత ప్రదర్శనపై విశ్లేషణ చేస్తున్న సమయంలో, సదరు యాంకర్ తీవ్ర అసహనానికి గురయ్యాడు.
భారత్ గెలుపును తట్టుకోలేక, ఆవేశంతో ఊగిపోతూ ఎల్ఈడీ టీవీని పగులగొట్టాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘‘పాక్ యాంకర్ల అతి అంటే ఇలాగే ఉంటుంది’’ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఏది ఏమైనా, భారత జట్టు సెమీఫైనల్‌కు చేరడం పాకిస్థాన్ మీడియాలో ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది.