అమెరికా దాడుల్లో ఖమేనీ కుమార్తె, మనవరాలు మృతి.. ధ్రువీకరించిన ఇరాన్ మీడియా
- అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ వారసులు ఖతం
- మరణించిన వారిలో కుమార్తె, మనుమరాలు, అల్లుడు
- ధ్రువీకరించిన ఇరాన్ అధికారిక మీడియా సంస్థలు
- మృతుల్లో కోడలు కూడా ఉన్నట్లు వెల్లడి
ఖమేనీ మరణంపై ఇప్పటికే భిన్న కథనాలు వస్తున్న తరుణంలో, ఆయన కుటుంబ సభ్యుల మృతిని ఇరాన్ మీడియా స్వయంగా ప్రకటించడం గమనార్హం. ఖమేనీ వారసులు ఈ దాడుల్లో బలికావడం ఇరాన్ పాలకులకు కోలుకోలేని దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.