వికారాబాద్‌లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

  • కోటపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న బలిజ దివ్య
  • నివాసంలో ఉరివేసుకుని బలవన్మరణం
  • ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు 
వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. పట్టణంలోని గంగారాం సాయి బాబా కాలనీలో నివాసం ఉంటున్న బలిజ దివ్య (27) ఇవాళ‌ తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

వివరాల్లోకి వెళితే... బలిజ దివ్య కోటపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ధరూర్ సీఐ కార్యాలయానికి అటాచ్‌గా పనిచేస్తున్నారు. శనివారం తెల్లవారుజామున ఆమె ఉరివేసుకుని ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వికారాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ దివ్య ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాల వల్ల ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారా? లేక విధి నిర్వహణలో ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.


More Telugu News