టీఎంసీ నుంచి దేశంలోనే తొలి ఎల్‌జీబీటీక్యూ ప్లస్ రాజ్యసభ అభ్యర్థి.. ఎవరీ మేనకా గురుస్వామి!
- రాజ్యసభ ఎన్నికలకు నలుగురు అభ్యర్థులను ప్రకటించిన టీఎంసీ
- జాబితాలో మంత్రి బాబుల్ సుప్రియో, నటి కోయల్ మల్లిక్
- అందరి దృష్టి సుప్రీంకోర్టు న్యాయవాది మేనకా గురుస్వామిపైనే
- సెక్షన్ 377 రద్దు కేసులో కీలక పాత్ర పోషించిన మేనకా
- గెలిస్తే పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్న తొలి క్వీర్ వ్యక్తిగా రికార్డు
పశ్చిమ బెంగాల్‌లో జరగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తమ అభ్యర్థులను ప్రకటించింది. మంత్రి బాబుల్ సుప్రియో, రాష్ట్ర మాజీ డీజీపీ రాజీవ్ కుమార్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి, ప్రముఖ నటి కోయల్ మల్లిక్‌లను ఎంపిక చేసినట్టు ఫిబ్రవరి 27న సాయంత్రం వెల్లడించింది. మార్చి 16న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
అయితే, ఈ నలుగురిలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి నామినేషన్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 377ను రద్దు చేయడంలో 2018లో జరిగిన న్యాయపోరాటంలో ఆమె పిటిషనర్ల తరఫున వాదించి కీలక పాత్ర పోషించారు. ఈ ఎన్నికల్లో ఆమె గెలిస్తే, పార్లమెంటులో అడుగుపెట్టనున్న తొలి బహిరంగ క్వీర్ (LGBTQ+) వ్యక్తిగా చరిత్ర సృష్టిస్తారు. ఈ నామినేషన్‌పై ఎన్సీపీ (శరద్ పవార్) జాతీయ అధికార ప్రతినిధి అనీష్ గవాండే స్పందిస్తూ "ఒక క్వీర్ వ్యక్తి పార్లమెంట్‌లో ఉండటం ఒక కల నిజమైనట్టుగా ఉంది" అని పేర్కొన్నారు.
మేనకా గురుస్వామి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో రోడ్స్ స్కాలర్. హార్వర్డ్ లా స్కూల్ నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. టైమ్ మ్యాగజైన్ 2019లో ప్రకటించిన ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాలో ఆమె చోటు దక్కించుకున్నారు. ఆమె తండ్రి మోహన్ గురుస్వామి గతంలో బీజేపీ వ్యూహకర్తగా, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాకు ప్రత్యేక సలహాదారుగా పనిచేశారు.
పశ్చిమ బెంగాల్‌లో ఖాళీ అవుతున్న ఐదు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం టీఎంసీ నాలుగు స్థానాలు, బీజేపీ ఒక స్థానం సులభంగా గెలుచుకునే అవకాశం ఉంది. దీంతో మేనకా గురుస్వామి ఎన్నిక దాదాపు ఖాయమైనట్టే.