Botsa Satyanarayana: బొత్స అస్వస్థతకు గురయ్యారని తెలిసి బాధపడ్డాను: పవన్ కల్యాణ్

Pawan Kalyan prays for Botsa Satyanarayanas speedy recovery
  • బొత్స త్వరగా కోలుకోవాలన్న పవన్ కల్యాణ్
  • ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థన
  • ఓ ప్రకటన విడుదల చేసిన డిప్యూటీ సీఎం
వైసీపీ మాజీ మంత్రి, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు వార్తలు రావడం తెలిసిందే. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. బొత్స సత్యనారాయణ త్వరగా కోలుకోవాలంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. 

"శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ త్వరగా ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షిస్తున్నాను. బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారని తెలిసి బాధపడ్డాను. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు అందించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను" అని తన ప్రకటనలో పేర్కొన్నారు.
Botsa Satyanarayana
Pawan Kalyan
Botsa Health
Telugu News
Andhra Pradesh Politics
YSRCP
Janasena
AP Deputy CM

More Telugu News