'ది కేరళ స్టోరీ 2' చిత్రం విడుదలకు మార్గం సుగమం.. స్టే ఎత్తివేసిన హైకోర్టు డివిజన్ బెంచ్

'ది కేరళ స్టోరీ 2' సినిమా విడుదల కాకుండా కేరళ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను డివిజన్ బెంచ్ ఎత్తివేసింది. దీంతో ఈ చిత్రం విడుదలకు మార్గం సుగమమైంది. ఈ చిత్రం విడుదల కాకుండా హైకోర్టు సింగిల్ బెంచ్ ఇటీవల స్టే ఇచ్చింది. సీబీఎఫ్‌సీ తీరును తప్పుబడుతూ సినిమాను పునఃపరిశీలించాల్సిందిగా ఆదేశించింది. 15 రోజుల పాటు సినిమాపై స్టే విధించింది.

సింగిల్ బెంచ్ తీర్పును చిత్ర నిర్మాత కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో సవాల్ చేశారు. ఈరోజు సాయంత్రం వరకు ఇరువర్గాల తరఫున సుదీర్ఘ వాదనలు విన్న జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి, జస్టిస్ పీవీబాలకృష్ణన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను ఎత్తివేసింది.

2023లో విడుదలైన 'ది కేరళ స్టోరీ' చిత్రానికి సీక్వెల్ 'ది కేరళ స్టోరీ 2' రూపొందింది. దీనికి కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించగా, విపుల్ అమృత్ లాల్ షా నిర్మించారు. ఉల్కా గుప్త, అదితి బాటియా, ఐశ్వర్య ఓజా ఈ చిత్రంలో నటించారు. నిజ జీవితంలో జరిగిన అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చెబుతున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 27న విడుదల చేస్తామని చిత్ర బందం ప్రకటించగా, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో వాయిదా పడింది. ఈరోజు డివిజన్ బెంచ్ తీర్పుతో ఈ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి.

The Kerala Story 2
Kerala High Court
Kamakhya Narayan Singh
Vipul Amrutlal Shah
Ulka Gupta

More Telugu News