వైసీపీ నేత బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్

  • తీవ్ర అస్వస్థతకు గురైన బొత్స సత్యనారాయణ 
  • నిన్న రాత్రి హైదరాబాద్ తరలింపు
  • సిటీ న్యూరో సెంటర్ లో చికిత్స
  • బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు
వైసీపీ మాజీ మంత్రి, శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. దాంతో ఆయనను నిన్న రాత్రి హైదరాబాదుకు తరలించారు. ఆయన ఈ తెల్లవారుజామున హైదరాబాదులోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. 

బొత్స ఓ మోస్తరు బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారని, ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. ప్రమాదమేమీ లేదని తెలిపారు. బొత్స తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న వార్తతో వైసీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఆయన త్వరగా కోలుకోవాలని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు కోరుకుంటున్నారు.


More Telugu News