Bhatti Vikramarka: తెలంగాణ ఉద్యోగులకు ‘భారీ’ ఊరట.. రూ. 745 కోట్ల బకాయిలు విడుదల చేసిన ప్రభుత్వం!

Bhatti Vikramarka Telangana Govt Releases Rs 745 Crore for Employee Arrears
  • పెండింగ్ బకాయిల విడుదలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు
  • విడతల వారీగా బకాయిల చెల్లింపు ప్రక్రియ షురూ
  • గ్రామ పంచాయతీలకు సైతం రూ. 389 కోట్ల నిధులు
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూ. 745 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవ తీసుకుని బకాయిల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేశారు.

హామీ నెరవేర్చిన సర్కార్
ఉద్యోగ సంఘాలతో గతంలో జరిపిన చర్చల సందర్భంగా.. పెండింగ్ బకాయిలను విడతల వారీగా క్లియర్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడతలో భాగంగా ఈ భారీ మొత్తాన్ని కేటాయించింది. జీతాలు, పెన్షన్లు మరియు ఇతర అలవెన్సుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఈ నిర్ణయంతో పెద్ద ఉపశమనం లభించినట్లయింది.

పంచాయతీలకూ నిధుల పంపిణీ
స్థానిక సంస్థల బలోపేతానికి కూడా ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు రూ.389 కోట్ల నిధులను విడుదల చేసింది. దీనివల్ల గ్రామాల్లో నిలిచిపోయిన అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణ మరియు ఇతర అత్యవసర పనులకు మార్గం సుగమం కానుంది.
Bhatti Vikramarka
Telangana government
Telangana employees
government employees salaries
Telangana pensions
Telangana arrears release
gram panchayats funds
Telangana finance department
local body funds
Telangana development works

More Telugu News