ఒక్కరోజులోనే యూటర్న్.. బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు

  • హైదరాబాద్‌లో రూ.550 పెరిగిన 24 క్యారెట్ల పసిడి
  • పలు నగరాల్లో రూ.1.61 లక్షలు దాటిన 10 గ్రాముల బంగారం
  • దేశంలో అత్యధికంగా చెన్నైలో బంగారం రేటు
  • కిలో వెండి ధర రూ.2.95 లక్షలకు చేరిక
బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పైకి ఎగిశాయి. నిన్న‌ స్వల్పంగా తగ్గుముఖం పట్టిన పసిడి, ఇవాళ‌ ట్రేడింగ్ ప్రారంభంలోనే తిరిగి పుంజుకుంది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి నిరాశే ఎదురైంది.

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈరోజు ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 పెరిగి రూ.1,61,570కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.500 పెరిగి రూ.1,48,100 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2.95 లక్షలుగా ఉంది.

దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలు పెరిగాయి. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర అత్యధికంగా రూ.1,62,550గా ఉండగా, ఢిల్లీలో రూ.1,61,720గా ఉంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో హైదరాబాద్‌తో సమానంగా రూ.1,61,570 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే, చెన్నైలో కిలో ధర రూ.2.95 లక్షలు పలుకుతుండగా, ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలలో రూ.2.85 లక్షలుగా ఉంది.


More Telugu News