అది ఎఫ్– 16 ఫైటర్ జెట్ కాదట.. ఫేక్ వీడియో పోస్ట్ చేశారంటున్న 'గ్రోక్'!

Taliban Fake Video Claims F16 Jet Downed


ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ప్రచార యుద్ధం కలకలం రేపుతోంది. పాకిస్థాన్‌కు చెందిన అత్యాధునిక ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు తాలిబన్లు ఒక వీడియోను వైరల్ చేయగా.. అది తప్పుడు సమాచారమని తేలింది. ‘ఆఫ్ఘనిస్థాన్ డిఫెన్స్’ అనే అనధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా పోస్ట్ చేసిన ఈ వీడియోను పరిశీలించిన ఎక్స్ ఏఐ ఇంజిన్ 'గ్రోక్'.. ఇది దుష్ప్రచారమేనని తేల్చిచెప్పింది.

వైరల్ గా మారిన వీడియో..

వైరల్ అవుతున్న వీడియోలో మంటల్లో కాలిపోతున్న విమానం తోక భాగంపై పాకిస్థాన్ జెండా, ‘85510’ అనే నంబర్లు కనిపిస్తున్నాయి. అయితే, ఆ విమానం పరిమాణం మరియు ఆకారం ఎఫ్-16 యుద్ధ విమానానికి ఏమాత్రం సరిపోలడం లేదని ఏఐ విశ్లేషణలో తేలింది. గతంలో ఎప్పుడో జరిగిన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను లేదా సంబంధంలేని ఇతర విమానాల శకలాలను వాడుకుని, ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో పాక్‌ను దెబ్బతీయడానికి ఈ ఫేక్ వీడియోను ప్రచారంలోకి తెచ్చినట్లు నిపుణులు భావిస్తున్నారు.

Go Back to Shorts
Fake video
F-16 fighter jet
Grok AI
Taliban
Afghanistan Pakistan border
Social media war
Pakistan Air Force
War propaganda
Afghanistan Defence
False information

More Telugu News