Sri Vishnu: రేపు శ్రీవిష్ణు 'విష్ణు విన్యాసం' రిలీజ్... రన్ టైమ్ ఎంతంటే..!

Sri Vishnus Vishnu Vinyaasam Releasing Tomorrow
  • 1 గంట 59 నిమిషాల నిడివితో వస్తున్న 'విష్ణు విన్యాసం'
  • నిడివి తక్కువే అయినా వినోదం ఫుల్ మీల్స్ అంటున్న హీరో శ్రీవిష్ణు
  • ఫిబ్రవరి 27న థియేటర్లలోకి రానున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్
  • యదునాథ్ మారుతి రావు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం
  • భారీ తారాగణంతో వస్తున్న ఈ సినిమాపై పెరిగిన అంచనాలు
విలక్షణ నటుడు శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'విష్ణు విన్యాసం'. యదునాథ్ మారుతిరావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రన్ టైమ్‌ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా నిడివి కేవలం 1 గంట 59 నిమిషాలు మాత్రమే ఉండనుందని శ్రీవిష్ణు స్వయంగా వెల్లడించారు. నిడివి తక్కువగా ఉన్నప్పటికీ, వినోదం మాత్రం ఫుల్ మీల్స్ రేంజ్‌లో ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ విషయంపై గురువారం తన ఎక్స్ ఖాతాలో శ్రీవిష్ణు ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. "లెంగ్త్ కొంచెం డైట్‌లో ఉంది... కానీ ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం ఫుల్ మీల్స్ విత్ ఎక్స్‌ట్రా డెజర్ట్. ఇది నా ప్రామిస్. రేపు ఫ్యామిలీతో రండి, ఎంజాయ్ చేసి, థియేటర్లలో మళ్లీ మళ్లీ రిపీట్ కొట్టండి!" అంటూ ప్రేక్షకులలో అంచనాలను పెంచారు. ఈ చిత్రం రేపు (ఫిబ్రవరి 27న) థియేటర్లలోకి రానుంది.

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు.జి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, హేమ, శాలిని సమర్పిస్తున్నారు. సాయికృష్ణ బొబ్బ, రామాచారి.ఎం సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టైటిల్ యానిమేటెడ్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. "నో బ్రేక్స్ - జస్ట్ లాఫ్స్" అనే ట్యాగ్‌లైన్‌తో, అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథ పూర్తిస్థాయి వినోదాత్మకంగా ఉండనుందని స్పష్టమవుతోంది.

ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్‌గా నటించగా... సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. రాధన్ సంగీతం అందించగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూశారు.
Sri Vishnu
Vishnu Vinyaasam
Telugu Movie
Nayan Sarika
Radhan Music
Comedy Film
Telugu Cinema
Theatrical Release
Sumanth Naidu G

More Telugu News