ముంబైలోని రూ.3,700 కోట్ల అనిల్ అంబానీ ఇంటిని అటాచ్ చేసిన ఈడీ
- పాల్ హిల్ నివాస ఆస్తిని తాత్కాలికంగా జప్తు చేసిన ఈడీ
- 17 అంతస్తులతో 66 మీటర్ల ఎత్తు ఉన్న విలాసవంత భవనం
- ఇప్పటి వరకు అటాచ్ చేసిన ఆస్తుల విలువ రూ.15,700 కోట్లు
అనిల్ గ్రూప్ కంపెనీలు కోట్లాది రూపాయల బ్యాంకు రుణాల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో సంబంధం ఉన్న ఈ కేసులో భాగంగా ఆ ఇంటిని ఈడీ అటాచ్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
గతంలో ముంబైలోని రూ.473.17 కోట్ల విలువైన ఆస్తిని కూడా ఈడీ అటాచ్ చేసింది. ఈ కేసుతో ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల విలువ రూ.15,700 కోట్లకు చేరింది. ఆర్.కామ్., దాని అనుబంధ సంస్థలు దేశీ, విదేశీ రుణదాతల నుంచి తీసుకున్న మొత్తంలో రూ.40,185 కోట్ల బకాయిలు ఉన్నాయి.