Gandhi Hospital: గాంధీ ఆసుపత్రిలో ‘ఐవీఎఫ్’ సక్సెస్.. తొలి బిడ్డ జననం

Gandhi Hospital IVF Success First Child Born
  • ఆసుపత్రి చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైందంటున్న వైద్యులు
  • రూ.5 కోట్లు వెచ్చించి అత్యాధునిక ల్యాబ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
  • నిరుపేదలకు అందుబాటులో ఖరీదైన సంతాన సాఫల్య చికిత్స


తెలంగాణ ప్రభుత్వ వైద్యరంగంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. సికింద్రాబాద్‌ లోని గాంధీ ఆసుపత్రిలో ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఐవీఎఫ్ సెంటర్‌లో చికిత్స పొందిన దంపతులకు సంతానం కలిగింది. గైనకాలజీ మరియు ఎంబ్రియాలజీ నిపుణుల బృందం పర్యవేక్షణలో ఈ ప్రసవం విజయవంతంగా జరిగింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ వెల్లడించారు. తొలి ఐవీఎఫ్ బిడ్డ జననంతో గాంధీ ఆస్పత్రి వర్గాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ప్రైవేట్ ఫెర్టిలిటీ సెంటర్లలో లక్షలాది రూపాయలు ఖర్చయ్యే ఈ చికిత్సను ఇక్కడ పూర్తి ఉచితంగా అందించారు. ఖరీదైన సంతాన సాఫల్య చికిత్సను నిరుపేదలకు ఉచితంగా అందించాలనే ప్రభుత్వ లక్ష్యం ఈ విజయంతో నెరవేరింది. 

నిరుపేదలకు వరం..
ఆర్థిక స్థోమత లేక సంతాన సాఫల్య చికిత్సకు దూరమవుతున్న వేలాది మంది దంపతులకు ఈ విజయం కొత్త ఆశలను చిగురింపజేసింది. ప్రభుత్వ రంగంలో ఇటువంటి అత్యాధునిక చికిత్స విజయవంతం కావడం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సాధించిన పెద్ద విజయంగా భావిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలోని ఈ సెంటర్‌లో సుమారు రూ.5 కోట్ల వ్యయంతో అత్యాధునిక ఎంబ్రియాలజీ ల్యాబ్, అడ్వాన్స్‌డ్ ఓటీలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.
Gandhi Hospital
IVF Success
Telangana
In Vitro Fertilization
Free IVF Treatment
Government Hospital
Childbirth
Fertility Treatment
হায়দ্রাবাদ
Public Health

More Telugu News