ట్రంప్ ‘సోలార్’ బాంబ్..!
- భారత సోలార్ ఉత్పత్తుల దిగుమతులపై 126% సుంకం
- ఇండోనేసియా, లావోస్ లపైనా భారీ సుంకాలు
- సుప్రీంకోర్టు షాక్ ఇచ్చినా తగ్గని అమెరికా అధ్యక్షుడు
‘‘అమెరికా ఫస్ట్’’ నినాదంతో దూసుకుపోతున్న డొనాల్డ్ ట్రంప్, భారత వాణిజ్యాన్ని మరోసారి దెబ్బకొట్టారు. మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే సోలార్ సెల్స్, ప్యానెల్స్ పై ఏకంగా 126 శాతం ప్రాథమిక డ్యూటీ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో క్లీన్ ఎనర్జీ ధరలు పెరిగినా సరే, చైనా లేదా భారత్ వంటి దేశాల నుంచి దిగుమతులను తగ్గించి, స్థానిక తయారీని పెంచాలన్నదే ట్రంప్ మొండి పట్టుదలగా కనిపిస్తోంది.
మూడు దేశాలపై కొత్త టారిఫ్ లు..
భారత్ తో పాటు ఇండోనేసియా (86% నుంచి 143%), లావోస్ (81%) దేశాలపై కూడా ట్రంప్ ప్రభుత్వం ఈ భారాన్ని మోపింది. ఈ మూడు దేశాల నుంచి అమెరికాకు సుమారు 4.5 బిలియన్ డాలర్ల విలువైన సోలార్ ఉత్పత్తులు దిగుమతి అవుతున్నాయి. భారత ప్రభుత్వం తన సోలార్ పరిశ్రమలకు అడ్డగోలుగా సబ్సిడీలు ఇస్తోందని, దీనివల్ల అమెరికాలోని స్థానిక కంపెనీలు నష్టపోతున్నాయని వాణిజ్య శాఖ వాదిస్తోంది. అందుకే ‘కౌంటర్ వైలింగ్ డ్యూటీ’ పేరిట ఈ బాదుడు మొదలుపెట్టింది.
సుప్రీం తీర్పును పక్కన పెట్టి..
ట్రంప్ విధించిన సాధారణ సుంకాలను రద్దు చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. అయినప్పటికీ ట్రంప్ వెనక్కి తగ్గకుండా ‘‘విదేశీ సబ్సిడీల’’ సాకుతో కేవలం కొన్ని రంగాలనే లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.
భారత్ పై ప్రభావం..
భారత్ ప్రస్తుతం అమెరికాకు సోలార్ ప్యానెల్స్ ఎగుమతి చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ 126% డ్యూటీ వల్ల భారతీయ కంపెనీల ఉత్పత్తులు అమెరికాలో విపరీతంగా ప్రియం కానున్నాయి. దీనివల్ల ఆర్డర్లు తగ్గిపోయే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.