పాక్ ఓటమి.. లైవ్ టీవీలో ఫైర్ అయిన షోయబ్ అక్తర్!
- ఇంగ్లండ్‌తో ఓటమి.. పాక్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టం
- లైవ్ టీవీ షోలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన షోయబ్ అక్తర్
- కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా నాయకత్వంపై తీవ్ర విమర్శలు
- గతంలో ఆఘా నియామకాన్ని స్వాగతించిన అక్తర్
టీ20 ప్రపంచకప్ సూపర్ 8లో ఇంగ్లండ్ చేతిలో పాకిస్థాన్ జట్టు ఘోర పరాజయం పాలవ్వడంతో ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిన్న జరిగిన ఈ మ్యాచ్‌లో ఓటమితో పాక్ సెమీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఒక లైవ్ టీవీ షోలో మాట్లాడిన అక్తర్, జట్టు కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా నాయకత్వ పటిమను ప్రశ్నిస్తూ తీవ్ర విమర్శలు చేశాడు.
పల్లెకెలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కు ముందు 'గేమ్ ఆన్ హై' అనే టీవీ షోలో అక్తర్ మాట్లాడుతూ.. "ఇంగ్లండ్ చెత్తగా ఆడి మనం రెండు పాయింట్లు సాధిస్తే బాగుంటుందని ఆశిస్తున్నా. ఒకవేళ భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించి, మనం సెమీస్‌కు వెళ్తే మా ఆనందానికి అవధులే ఉండవు" అని అన్నాడు. అయితే, మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోరంగా ఓడిపోవడంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యాడు.
మ్యాచ్ అనంతరం జరిగిన చర్చలో కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా నాయకత్వానికి అర్హుడు కాదంటూ అక్తర్ వ్యాఖ్యానించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సల్మాన్ అలీని కెప్టెన్‌గా నియమించినప్పుడు, ఆ నిర్ణయాన్ని స్వాగతించిన తొలి వ్యక్తులలో అక్తర్ ఒకరు కావడం గమనార్హం. ఇప్పుడు ఆయనే కెప్టెన్‌ను విమర్శిస్తూ మాట మార్చడం చర్చనీయాంశంగా మారింది.