Tirumala: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. 25 కంపార్టుమెంట్లలో భక్తులు

Tirumala Rush Continues with Devotees Waiting in 25 Compartments
  • వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులు
  • టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి 12 గంటల సమయం పడుతుందన్న అధికారులు
  • రూ. 300 టికెట్ ఉన్న భక్తులకు 2 నుంచి 3 గంటల సమయం పడుతుందని వెల్లడి

కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు. బుధవారం ఉదయానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 


టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికి 3 నుంచి 5 గంటల సమయం పడుతుందని వెల్లడించారు. రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్న భక్తులకు 2 నుంచి 3 గంటల సమయం పడుతుందని తెలిపారు. 

నిన్న మొత్తం 74,902 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మొత్తం 22,869 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. హుండీ ద్వారా రూ. 4.05 కోట్ల ఆదాయం వచ్చింది.
Tirumala
Tirumala rush
Tirumala devotees
TTD
Tirumala darshan
Vaikuntam Queue Complex
Seven Hills
Srivari Darshan
Tirupati
Andhra Pradesh

More Telugu News