హైదరాబాద్‌లో విషాదం: యూట్యూబర్ కోమలి ఆత్మహత్య

YouTuber Komali Suicide in Hyderabad
హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. యూట్యూబర్‌గా గుర్తింపు పొందిన కోమలి (21) ఆత్మహత్య చేసుకున్నారు. మణికొండలోని చిత్రపురి కాలనీలో ఉన్న తన మేనమామ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రేమ విఫలమవ్వడంతోనే ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
 
వివరాల్లోకి వెళితే, విశాఖపట్నంకు చెందిన కోమలి, మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతూనే యూట్యూబ్ వీడియోలు చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. గత మూడేళ్లుగా మరో యూట్యూబర్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన అఖిల్ రెడ్డితో ఆమె ప్రేమలో ఉన్నట్లు సమాచారం. సుమారు ఏడాది క్రితం వీరిద్దరూ విడిపోయారు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన కోమలి, కొన్ని నెలల క్రితం కూడా ఆత్మహత్యకు యత్నించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 
 
ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకోగా, కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అఖిల్ రెడ్డిని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. 

తన బాయ్‌ఫ్రెండ్‌తో తిరిగి కలవాలని కోరుకుంటూ తిరుమలకు కాలినడకన వెళ్లిన వీడియోను కోమలి చివరిసారిగా పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఆమె అభిమానులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
 
Go Back to Shorts
Komali
YouTuber Komali
Hyderabad
Suicide
Akhil Reddy
Love failure
Manikonda
Vishakapatnam
Malla Reddy University

More Telugu News