డేవిడ్ మిల్లర్‌తో వీడియో.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు రేప్ బెదిరింపులు!
- భారత్ ఓటమి తర్వాత ఫన్నీ వీడియోపై ఫ్యాన్స్ ఆగ్రహం
- రేప్ బెదిరింపులు, బాడీ షేమింగ్‌తో ఫేస్‌బుక్ నుంచి వీడియో డిలీట్
- వేధింపులకు పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్న ఆర్జే ప్రిన్సీ
టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమి తర్వాత ఆ జట్టు ఆటగాడు డేవిడ్ మిల్లర్‌తో సరదాగా వీడియో పోస్ట్ చేసిన ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు తీవ్ర వేధింపులు ఎదురయ్యాయి. ఆర్జే ప్రిన్సీ పారిఖ్ అనే ఆ యువతిపై కొందరు నెటిజన్లు దారుణంగా బాడీ షేమింగ్ చేయడమే కాకుండా, అత్యాచార బెదిరింపులకు సైతం పాల్పడ్డారు. ఈ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది.
భారత్ ఓటమిలో కీలకపాత్ర పోషించిన డేవిడ్ మిల్లర్‌తో ప్రిన్సీ సరదాగా ఓ వీడియో చిత్రీకరించి "మనం స్నేహితులం అనుకున్నా డేవిడ్" అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది. ఇది చూసిన కొందరు టీమిండియా అభిమానులు ఆమెపై విరుచుకుపడ్డారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ, అత్యాచార బెదిరింపులకు దిగారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రిన్సీ ఫేస్‌బుక్ నుంచి ఆ వీడియోను తొలగించారు. అయితే, ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం అలాగే ఉంది. తనపై వచ్చిన బెదిరింపులు, బాడీ షేమింగ్ కామెంట్లను భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ సూపర్-8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 76 పరుగుల భారీ తేడాతో భారత్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా, డేవిడ్ మిల్లర్ (63) అద్భుత ఇన్నింగ్స్‌తో 187 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత జట్టు 111 పరుగులకే కుప్పకూలింది. ఈ ఓటమితో టీ20 ప్రపంచకప్‌లలో భారత్ 12 వరుస విజయాల జోరుకు బ్రేక్ పడింది. సెమీస్ చేరాలంటే తదుపరి మ్యాచ్‌లలో తప్పక గెలవాల్సిన పరిస్థితిలో టీమిండియా నిలిచింది.