Shruti Haasan: శ్రుతిహాసన్ ను మరిచిపోకుండా చేసింది ఆ సినిమానే!

Shruti Haasan Special
  • శ్రుతి హాసన్ కి మంచి క్రేజ్ 
  • వరుసగా సినిమాలు చేయని శ్రుతి
  • మరిచిపోతున్న ఆడియన్స్
  • చేతిలో ఉన్నవి మూడు ప్రాజెక్టులు  
        
స్టార్ హీరోలు సినిమాకి .. సినిమాకి మధ్య గ్యాప్ ఎక్కువ తీసుకున్నప్పటికీ ఆ సినిమా కోసం అభిమానులు వెయిట్ చేస్తూ ఉంటారు. స్టార్ డమ్ ఉన్నప్పటికీ, హీరోయిన్స్ విషయంలో మాత్రం ఈ సూత్రం వర్తించదు. ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ, హీరోయిన్స్ వరుస సినిమాలు చేయకపోతే మాత్రం వాళ్లను మరిచిపోయే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కొత్త హీరోయిన్స్ కి తమ అభిమానాన్ని కేటాయిస్తుంటారు.

ఆడియన్స్ అలా మరిచిపోకుండా ఉండటం కోసం ఏదో ఒక సినిమా చేస్తూ కెరియర్ ను నెట్టుకొచ్చే హీరోయిన్స్ చాలామందే ఉన్నారు. అయితే శ్రుతి హాసన్ మాత్రం కెరియర్ ను లైట్ తీసుకుని చాలా కాలమైనట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకదాని తరువాత ఒకటిగా ప్రాజెక్టులు లైన్లో పెట్టినట్టుగా మనకి కనిపించదు. తనకి తోచిన సినిమాలు చేసుకుంటూ వెళుతోందంతే. ప్రస్తుతం ఆమె చేతిలో 'సలార్' సీక్వెల్ తో పాటు, దుల్కర్ జోడిగా 'ఆకాశంలో ఒక తార' .. విజయ్ సేతుపతి సరసన 'ట్రైన్' కనిపిస్తున్నాయంతే.

నిజానికి ఆమె ఈ ప్రాజెక్టులు చేస్తుండబట్టి చాలా కాలమే అవుతోంది. 'వీరసింహారెడ్డి' .. 'వాల్తేర్ వీరయ్య' .. 'సలార్' సినిమాలు అనుకోకుండా ఒకే ఏడాదిలో పడ్డాయి. 2023 తరువాత ఆమె చేసిన సినిమా 'కూలీ' మాత్రమే. 2025లో వచ్చిన ఈ సినిమాలో ఆమె రజనీ కూతురు పాత్రలో నటించింది. ఈ ఒక్క సినిమా పడకపోతే, శ్రుతి హాసన్ ను మరిచిపోయేవారే అనుకునేవారు లేకపోలేదు. ఇక ఈ ఏడాదిలో ఆమె సినిమాలలో ఏమేం పలకరిస్తాయో .. ఆమె క్రేజ్ ను ఎంతవరకూ పట్టి ఉంచుతాయనేది చూడాలి. 

Shruti Haasan
Salaar
Veera Simha Reddy
Waltair Veerayya
Coolie
Telugu cinema
Indian movies
actress career
Tollywood
Rajinikanth

More Telugu News