Samuthirakani: జీ 5లో సముద్రఖని క్రైమ్ థ్రిల్లర్!
- సముద్రఖని ప్రధానమైన పాత్రగా 'తడయం'
- క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ
- యథార్థ సంఘటనల ఆధారంగా నడిచే కంటెంట్
- ఈ నెల 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్
సీరియల్ కిల్లర్ .. అతణ్ణి పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్స్ చేసే ప్రయత్నాలతో చాలా సిరీస్ లు ఇంతకుముందు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉంటాయి. అలాగే ఇప్పుడు మరో క్రైమ్ థ్రిల్లర్ ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతోంది. సముద్రఖని ప్రధానమైన పాత్రను పోషించిన ఆ సిరీస్ పేరే 'తడయం'. నవీన్ కుమార్ పళనివేల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, ఈ నెల 27వ తేదీ నుంచి 'జీ 5' ద్వారా పలకరించనుంది.
తమిళంలో రూపొందిన సిరీస్ ఇది. ఈ సిరీస్ లో సముద్రఖని పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. సముద్రఖని తన కెరియర్లో చాలా పవర్ఫుల్ పాత్రలను పోషించాడు. వాటిలో ఆయనకి పేరు తెచ్చిపెట్టిన పోలీస్ పాత్రలు కూడా ఉన్నాయి. అందువలన ఈ సిరీస్ ను చూడటానికి చాలామంది ఆసక్తిని కనబరుస్తున్నారు. తమిళంతో పాటు వివిధ భాషల్లో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది.
కథాపరంగా చూసుకుంటే, 1999లో జరిగే కథ ఇది. తమిళనాడు - ఆంధ్ర సరిహద్దుల్లో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. హంతకుడు వివాహమైన స్త్రీలను లక్ష్యంగా చేసుకుంటూ ఉంటాడు. హత్య చేసిన అనంతరం వాళ్ల మెడలోని 'తాళి'ని దొంగిలిస్తూ ఉంటాడు. హంతకుడు ఎవరు? ఎందుకోసం హత్యలు చేస్తున్నాడు? అనేది మిగతా కథ. యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ ఎలా ఉంటుందనేది చూడాలి మరి.