Rashmika Mandanna: విజయ్‌తో తొలి ముద్దు సీన్.. పెళ్లి వేళ వైరల్ అవుతున్న రష్మిక వ్యాఖ్యలు!
- ఉదయ్‌పూర్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుకలు ప్రారంభం
- ఎల్లుండి ఆరావళి కొండల్లోని విలాసవంతమైన రిసార్ట్‌లో పెళ్లి
- కేవలం 100 మంది అతిథులతో అత్యంత ప్రైవేట్‌గా ఈ వేడుక
- పెళ్లి నేపథ్యంలో 'గీత గోవిందం' నాటి ముద్దు సీన్‌పై రష్మిక పాత వ్యాఖ్యలు వైరల్
టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుకలు రాజస్థాన్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి 26 వరకు మూడు రోజుల పాటు ఈ పెళ్లి సందడి కొనసాగనుంది. ఎల్లుండి ఉదయ్‌పూర్‌లోని ఆరావళి పర్వత శ్రేణుల మధ్య ఉన్న అత్యంత విలాసవంతమైన 'ఐటీసీ మెమెంటోస్' రిసార్ట్‌లో వీరిద్దరూ ఏడడుగులు వేయనున్నారు.
ఈ వివాహాన్ని అత్యంత ప్రైవేట్‌గా, కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరపాలని ఈ జంట నిర్ణయించుకుంది. ఈ రిసార్ట్ బయటి ప్రపంచానికి దూరంగా, పూర్తి ఏకాంతంగా ఉంటుంది. ఇందులో 117 ప్రైవేట్ విల్లాలు, ఒక నది, సరస్సుతో పాటు సొంత హెలిప్యాడ్ సౌకర్యం కూడా ఉంది. ఈ వేడుకకు తెలంగాణకు చెందిన కొందరు రాజకీయ నాయకులు, కొంతమంది సినీ దర్శకులు మినహా పెద్ద సినీ తారలెవరూ హాజరుకావడం లేదని తెలుస్తోంది. మొత్తం అతిథుల సంఖ్య 100 మందికి మించదని సమాచారం.
గతంలో 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' చిత్రాలలో విజయ్, రష్మికల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అభిమానులు ముద్దుగా వారిని 'విరోష్' అని పిలుచుకుంటారు. తమ పెళ్లిని అధికారికంగా ప్రకటిస్తూ ఈ జంట ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. "మేము ఏ ప్రణాళికలు వేసుకోకముందే, మాకోసం మీరు ఒక పేరు ఇచ్చారు. మమ్మల్ని 'విరోష్' అని పిలిచారు. మీ ప్రేమకు ధన్యవాదాలు" అని అందులో పేర్కొన్నారు.
ఈ పెళ్లి వేళ రష్మిక గతంలో 'గీత గోవిందం' సినిమాలోని తన తొలి ఆన్‌స్క్రీన్ కిస్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతున్నాయి. "తొలిసారి ఆన్‌స్క్రీన్‌పై ముద్దు సీన్‌లో నటించడం చాలా ఇబ్బందిగా అనిపించింది. అది చాలా వ్యక్తిగతమైన విషయం. సెట్‌లో 200 మంది చూస్తుండగా ఎలా చేయాలో అర్థం కాలేదు. అయితే, నా కో-యాక్టర్ విజయ్‌ది కూడా అదే పరిస్థితి. చివరకు అది ఒక టెక్నికల్ విషయంలా పూర్తి చేశాం. పాత్రకు అవసరమైతే చేయాల్సిందే" అని రష్మిక ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
కాగా, గతేడాది అక్టోబర్ 3న హైదరాబాద్‌లోని విజయ్ నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య వీరి నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగిన విషయం తెలిసిందే.